ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా ఈనెల 27న థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే సాంగ్స్ తో ఈసినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇందుకోసం కర్నూల్ లో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఫ్యాన్స్ ఎమోషన్స్ ఎలా వుంటాయో ట్రైలర్ లో చూపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. వివేక్- మెర్విన్ బీజీఎమ్ రిఫ్రెషింగ్ గా అనిపించింది.ట్రైలర్ చివర్లో ఉపేంద్ర ను కూడా చూపెట్టారు. ఆ సన్నివేశాలు సినిమాపై హైప్ ను రెట్టింపు చేశాయి. తనను విపరీతంగా అభిమానించే అభిమాని కోసం ఆ హీరో ఏం చేశాడు అనేది కథ తో వస్తుంది ఈసినిమా. హీరో పాత్రలో ఉపేంద్ర కనిపించనుండగా అభిమాని గా సాగర్ అనే పాత్రలో రామ్ నటించాడు.ప్రతి ఒక్క హీరో అభిమాని గర్వపడేలా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ మహేష్ బాబు.ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే రామ్ ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ మూవీ తో వస్తున్నాడనిపిస్తుంది..అంతేకాదు ఈసినిమాతో రామ్ కెరీర్ లో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.
మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నిజానికి ఈసినిమాను 28 న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ యూఎస్ఏ లో 26నే ప్రీమియర్స్ వేస్తుండడంతో ఇక్కడ కూడా ఓ రోజు ముందుకు జరిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























