అల్లరి నరేష్ గారిని ఇకపై అందరి నరేష్ అని పిలవాలని కోరుకుంటున్నాను – హరీష్ శంకర్

Harish Shankar Talks About Allari Naresh at the 12A Railway Colony Pre-Release Event

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ’12A రైల్వే కాలనీ’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి దర్శకులు హరీష్ శంకర్ ,వి ఐ ఆనంద్ , విజయ్ కనకమేడల ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ… ఈ సినిమా ట్రైలర్ చూడగానే డైరెక్టర్ నాని గురించి మాట్లాడాలనిపించింది. ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. తనే ఎడిటర్ అని చెప్పారు. ఒక డైరెక్టర్ ఎడిటర్ అయితే సినిమా డబల్ కా మీఠా. నేను పొలిమేర ఫంక్షన్ కి వెళ్ళాను. తర్వాత పార్ట్ 2 వచ్చింది. అది మరిన్ని పార్ట్స్ రావచ్చు. అలాగే ధమాకా ఫంక్షన్ కి వెళ్ళాను. అది ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలాగే నరేష్ గారు విజయ్ నాంది సినిమాకి వెళ్లాను. అదే రకంగా నిర్మాత శ్రీనుగారికి పవన్ గారికి అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఈవివి గారి సినిమాలు చూసిన తర్వాత రైటర్ గా కావాలని డిసైడ్ అయ్యాను. అక్కడినుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం నాకు రాలేదు. అందుకే నరేష్ గారిని ఎప్పుడు కలిసి అవకాశం ఉన్న వచ్చేస్తాను. ఒక దర్శకుడికి అవకాశం ఇస్తే ఎంతో మందికి అవకాశం ఇచ్చినట్టు. నరేష్ గారు 35 మంది దర్శకులను పరిచయం చేశారు. ఆ రకంగా చూస్తుంటే కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చారు. నరేష్ గారు ఎన్నో సినిమాలు చేశారు. ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి అల్లరి నరేష్ అన్నారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్ తో వెళ్లిన రెడీగా ఉంటారు. కాబట్టి ఆయన అల్లరి నరేష్ గారు ఇకపై అందరి నరేష్ అని పిలవాలని కోరుకుంటున్నాను. నవంబర్ 21 న సినిమాని అందరూ నాతో పాటు చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.