12 A రైల్వే కాలనీ సెన్సార్ కంప్లీట్   

12A Railway Colony Completes Censor Formalities

అల్లరి నరేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 12ఏ రైల్వే కాలనీ ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు రానుంది.అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈసినిమాకు  షార్ట్  రన్ టైం ఫిక్స్ చేశారు.కేవలం 125 నిమిషాల 30 సెకండ్ల నిడివి తో థియేటర్లలోకి రానుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిస్టరీ మర్డర్స్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అల్లరి నరేష్ ఇందులో సీరియస్ పాత్ర పోషించారు.కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, విష్ణు హర్ష, గెటప్ శ్రీను, సద్దాం మరియు జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్ని నాని కసరగడ్డ అనే కొత్త దర్శకుడు రూపొందించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. పొలిమేర డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ కథ , మాటలు అందించారు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.  

ఇక ఈసినిమా విజయంపై  అల్లరి నరేష్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. నాంది తో  హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించిన నరేశ్ ఆతరువాత వరుసగా నిరాశపరిచాడు.మరి 12 A రైల్వే కాలనీ తో కం బ్యాక్ ఇస్తాడో చూడాలి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.