ఆంధ్ర కింగ్ తాలూకా ఒక రోజు ముందుగానే  

Andhra King taluka Arriving a Day Early

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు.నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ్యాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన బయోపిక్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌  అనౌన్స్‌మెంట్‌ నుంచే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ప్రేక్షకుల జీవితాలను ప్రతిబింబించే యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా అందించబోతున్నారు.వివేక్–మెర్విన్ స్వరపరిచిన సౌండ్‌ట్రాక్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి.  సాంగ్స్ కోసం తొలిసారిగా రామ్ పోతినేని రైటింగ్‌, వోకల్స్‌ ఇవ్వడం అందరినీ అలరించింది.రామ్, భాగ్య శ్రీ  కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రేక్షకుల డిమాండ్, అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో విడుదలను ఒక రోజు ముందుకు జరపాలనే నిర్ణయం జరిగింది.మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే కొత్త కాన్సెప్ట్‌తో వస్తోంది.ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.ట్రైలర్‌ను నవంబర్ 18న కర్నూలులో భారీ పబ్లిక్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఇదే తొలిసారిగా జరగనుంది.రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.