నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ అఖండ 2. ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచేలా నిన్న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ అదిరిపోయింది.యునానిమస్ పాజిటివ్ టాక్ తో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను హిందీ ప్రేక్షకులు టార్గెట్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అందుకు తగ్గట్లే ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను ముంబై లో నిర్వహించి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక నార్త్ లో ఈసినిమాను టాప్ ప్రొడక్షన్ హౌజ్ జీ స్టూడియోస్ రిలీజ్ చేయనుంది. దాంతో హిందీలో అఖండ 2 భారీ స్థాయిలో విడుదలకానుంది.
ఇందులో సంయుక్త మీనన్ ,హర్షాలి మల్హోత్రా , ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించగా బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ 5న ఈసినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది. మరోవైపు అఖండ నుండి అపజయమే లేకుండా కొనసాగుతున్నారు బాలకృష్ణ. మరి అఖండ 2తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























