గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక నిన్న , ముంబైలోని జుహూలోని PVR మాల్‌లో జరిగిన ఈవెంట్ లో అఖండ 2 ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, నా అభిమానులకు ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు ధన్యమైన జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ముందుగా ప్రణామాలు. వారి ఆశీర్వాదంతోనే నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను. మా నాన్నగారి అడుగుజాడల్లో ముందుకు వెళుతున్నాను. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నాను. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతోమందికి ఉచితవైద్యం అందించడం జరుగుతోంది. ఇంతమంది అభిమానుల్ని పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఉన్నాను. సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు. హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమం అఖండ2లో సినిమాలో చూస్తారు. ధర్మంగా బ్రతకండి, సత్యం మాట్లాడండి, అన్యాయానికి తలవంచకండి..ఇది అఖండ తాండవం. బోయపాటి గారితో మూడు సినిమాలు చేశాం. సింహ, లెజెండ్, అఖండ.. మూడు హ్యట్రిక్స్. ఇది నాలుగో సినిమా. బోయపాటి గారు నేను ఒకటే వేవ్ లెంత్ లో వర్క్ చేస్తాం.
తమన్ తో అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత కేసరి, డాకు మహారాజ్ ఇప్పుడు అఖండ2. మాది అద్భుతమైన కాంబినేషన్. కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహదేవన్ గారు హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రతిఒక్కరు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమాని చూపించాలి. మన హిందూ సనాతన ధర్మం ఏమిటో చెప్పాలి. బజరంగ్ భాయిజాన్ తర్వాత హర్షాలి ఈ సినిమా చేసింది. ఈ సినిమాలో తనది చాలా కీలకమైన పాత్ర. ఆది పినిశెట్టి అద్భుతమైన నటుడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆచంట రామ్ గారు గోపి గారి నిర్మాణంలో నాకు ఇది రెండో సినిమా. చాలా మంచి సినిమాలు తీయాలి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని తపనతో ఉండే ప్రొడ్యూసర్స్.జార్జియా, మధ్యప్రదేశ్ ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేసిన సినిమా ఇది. సినిమాని ప్రజెంట్ చేస్తున్న నందమూరి తేజస్విని మా అమ్మాయి. నేను హోస్టుగా చేసిన అన్ స్టాపబుల్ ఇండియాలో నెంబర్ వన్ షో. ఆ షోకి మా అమ్మాయి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేశారు. అఖండ2 చాలా అద్భుతమైన సినిమా. డిసెంబర్ 5న మీ ముందుకు వస్తుంది. ముంబై ఈవెంట్ లో ఈ సాంగ్ ని లాంచ్ చేయడం ఇక్కడి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్యు. జైహింద్.. జై భారత్.. జై హైందవ సనాతన ధర్మం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























