ఐ -బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్

i-Bomma Administrator Taken Into Custody

మూవీ పైరసీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రీసెంట్ గా మూవీ రూల్జ్ నిర్వాహకులను అరెస్ట్ చేయగా తాజాగా మరో ప్రముఖ ఆన్‌లైన్ సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ కీలక నిర్వాహకుడైన రవి ఇమ్మాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి విదేశాల నుండి హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ నిందితుడి కోసం పోలీసులు గత ఆరు నెలలుగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతడిని కూకట్‌పల్లి స్టేషన్‌కి తరలించినట్లు సమాచారం. రవి కరేబియన్ దీవుల నుండి ఈ పైరసీ సైట్ ను నిర్వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఐబొమ్మ వెబ్‌సైట్ ఓటీటీల్లో విడుదలైన కొత్త సినిమాలు మరియు థియేటర్లలో విడుదలైన హెచ్‌డీ ప్రింట్లను సైతం అక్రమంగా పైరసీ చేసి ఉచితంగా అందిస్తూ వచ్చింది. దీని వల్ల సినీ పరిశ్రమకు దాదాపు రూ.3,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. గతంలో మూవీరూల్జ్ నిర్వాహకుల అరెస్ట్ తర్వాత, ఐబొమ్మను కూడా పట్టుకుంటామని పోలీసులు ప్రకటించగా, ఆ సమయంలో ఐబొమ్మ నిర్వాహకుడు రవి పోలీసుల ప్రకటనను సవాలు చేస్తూ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు.

తన వెబ్‌సైట్‌పై దృష్టి పెడితే సినీ పరిశ్రమ, పోలీసు అధికారులు మరియు హీరోల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన సీక్రెట్‌లను బయటపెడతానని హెచ్చరించాడు.దాంతో ఈ బహిరంగ సవాలును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేసి, తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.