తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు దర్శకుడు సుందర్ సి కాంబోలో మళ్లీ సినిమా వస్తుందని అభిమానులు ఆశించారు.గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరుణాచలం బ్లాక్‌బస్టర్ కావడంతో రాబోయే తలైవర్ 173 సినిమా కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని మూవీ లవర్స్ ఎదురుచూశారు.అయితే మూవీ అనౌన్స్ మెంట్ వచ్చి పది రోజులు కూడా కాకముందే దర్శకుడు సుందర్ సి షాక్ ఇచ్చారు.ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు నిరాశ కలిగించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.మీతో ముఖ్యమైన వార్తను పంచుకోవాలనుకుంటున్నా. ఊహించని, అనివార్య కారణాల వల్ల లెజెండరీ స్టార్ కమల్ హాసన్ నిర్మించాల్సిన తలైవా 173 ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకుంటున్నాను అని సుందర్ సి తెలిపారు. తాను తప్పుకోవడానికి గల ప్రత్యేక కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.రజనీకాంత్ అలాగే కమల్ హాసన్‌లతో తనకున్న గత అనుబంధాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు.అంతేకాకుండా తమ కాంబినేషన్‌లో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ సుందర్ సి తన సందేశాన్ని ముగించారు.
ఇక సుందర్ సి తప్పుకోవడంతో, తలైవర్ 173 ని ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే చర్చ మొదలైంది.ఇందులో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు పేరు ఎక్కువగా వినబడుతుంది. గతంలో రజినీకాంత్ కు పేటతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఈ దర్శకుడు.మరి తలైవర్ 173 డైరెక్ట్ చేసే అవకాశం కార్తీక్ సుబ్బరాజు కే దక్కుతుందా లేదా మరో డైరెక్టర్ ఎవరికైనా ఈ ఛాన్స్ వస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























