మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో మెగా 158 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా టెక్నికల్ టీమ్ గురించి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాకు మాలీవుడ్‌లో టాప్ డీఓపీగా రాణిస్తున్న నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించనున్నారని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిమిష్ రవి మలయాళంలో లుకా, రోర్షాచ్, కురుప్, కింగ్ ఆఫ్ కొత్త వంటి చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించడం ద్వారా పాపులర్ అయ్యారు. ఆయన ఇప్పటికే తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం సూర్య 46 సినిమాకి కూడా పనిచేస్తున్నారు.
ఇక ఇప్పుడు మెగా 158కు నిమిష్ రవిని తీసుకోవడంతో ఈ చిత్రంలో విజువల్స్ మరియు చిరంజీవి మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లను ఆయన తన కెమెరా పనితనంతో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.ఈ చిత్రం నవంబర్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ మరియు లోహిత్ నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























