గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి ఎలా రావాలో చెప్పిన రాజమౌళి

Rajamouli Gives Instructions for the Globe Trotter Event

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబ్ ట్రాటర్  SSMB 29  సినిమా కోసం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించబోతున్న అతిపెద్ద ఈవెంట్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ముందు జాగ్రత్తగా ఒక అలర్ట్ మెసేజ్‌ను వీడియో రూపంలో విడుదల చేశారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వీడియోలో, రాజమౌళి ముఖ్యంగా ఈవెంట్‌కు వచ్చే ప్రేక్షకులు పాటించాల్సిన నియమాలను, భద్రతాపరమైన అంశాలను వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ నుంచి ఎలా రావాలి, ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎంత త్వరగా వస్తే మంచిది అనే విషయాలను ఆయన క్లుప్తంగా తెలిపారు.

అంతే కాకుండా, ఈసారి ఈవెంట్‌కు 18 ఏళ్ల లోపు వారికి, సీనియర్ సిటిజన్స్‌కు పోలీస్ యంత్రాంగం నుంచి ఎలాంటి అనుమతి లేదని ఆయన స్పష్టంగా తెలియజేశారు. అభిమానులందరి భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిబంధనలు పెట్టామని, ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా ఈవెంట్‌ను రద్దు చేయబడుతుందని రాజమౌళి తీవ్రంగా హెచ్చరించారు. ఈవెంట్ సజావుగా, సంతోషంగా జరిగేందుకు అభిమానులు భద్రతా సిబ్బందికి, నిర్వాహకులకు పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్


మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.