మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాంత’. ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.1950ల నాటి సినిమా నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ థ్రిల్లర్ గా రానుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో రానా , సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈసినిమాకి ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. రేపు హైదరాబాద్ లో సెలెక్టెడ్ థియేటర్లలో సాయంత్రం నుండి షోస్ వేయనున్నారు.ఆ షోస్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి. హిట్ టాక్ వస్తే కాంత సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.ప్రస్తుతం వేరే సినిమాలతో పోటీ లేకపోవడం కాంత కు కలిసిరానుంది.
ఇక ఈసినిమా 2 గంటల 43 నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.’ది హంట్ ఫర్ వీరప్పన్’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి మరియు దుల్కర్ సల్మాన్ తమ బ్యానర్ల ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























