చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్న సినిమా బైకర్. యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం పూర్తయ్యే దశకు చేరుకుంది. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను వదిలారు.అయితే లిరికల్ వీడియో సాంగ్ కాకుండా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఆడియో పరంగానే కాదు విజువల్ గా కూడా ఆకట్టుకుంది. డ్యాన్స్ నెంబర్ గా వచ్చిన ఈ పాటలో శర్వా స్టెప్స్ హైలైట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసాంగ్ ను సుబ్లాషిని ,గిబ్రాన్ , యాసిన్ నిజార్ పాడగా కృష్ణ కాంత్ రచించారు.1990, 2000 బ్యాక్ డ్రాప్ లో సాగే బైకర్ రేసింగ్ యాక్షన్ తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కుతుంది ఈసినిమా. ఇందులో ప్రముఖ నటుడు డా . రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనుండగా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుంది. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జె. యువరాజ్, మ్యూజిక్ జిబ్రాన్, అనిల్ కుమార్ పి ఎడిటర్.రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. బైకర్ డిసెంబర్ 6న థియేటర్లోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























