మా వందే.. కీలక పాత్రలో రవీనా టాండన్

Bollywood Star Raveena Tandon Plays a Major Role in Maa Vande

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మా వందే అనే టైటిల్ తో ఈ బయోపిక్ రానుండగా ఇందులో మలయాళ హీరో ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో కనిపించనున్నాడు.క్రాంతి కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ను తీసుకున్నారు. ఇంతకుముందు రవీనా, కన్నడ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ 2 లో ప్రధాన మంత్రి పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు భారత ప్రధాని మోదీ బయోపిక్ లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.

మావందే కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అందులో భాగంగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ,రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ , శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనున్నారు.భారీ బడ్జెట్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ ఈసినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తుంది.ఈసినిమాను అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.