ది గర్ల్ ఫ్రెండ్ 5  డేస్ కలెక్షన్స్ 

the girlfriend 5 days collections

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ తెరక్కించిన చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వర్కింగ్ డేస్ లోకూడా సూపర్ గా హోల్డ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది. ఈరోజుతో దాదాపు అన్ని ఏరియాల్లో ప్రాఫిట్ లోకి ఎంటర్ అవ్వనుంది.5 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 20. 4కోట్లకుపైనే వసూళ్లను రాబట్టింది. ఇక అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా విజయం దిశగా సాగుతుంది. నిన్నటి తో యూఎస్ఏ లో 500K డాలర్ల వసూళ్లను క్రాస్ చేసింది. ఫుల్ రన్ లో 1 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమా సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం ఈరోజు సక్సెస్ మీట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకుంది.ఈ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ రానున్నాడు.ఈ ఈవెంట్ పార్క్ హయత్ లో సాయంత్రం 6 గంటలకు జరుగనుంది.ఈసినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో నటించగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. గీతా ఆర్ట్స్ నిర్మించింది.

ది గర్ల్‌ఫ్రెండ్ కథ : భూమా (రష్మిక మందన్న) అనే అమ్మాయి, తన పీజీ కోసం హైదరాబాద్‌లోని ఒక కాలేజీలో చేరుతుంది. అక్కడే పీజీ చేస్తున్న విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఆమెను ఇష్టపడతాడు. విక్రమ్‌కి జెలసీ, పొసెసివ్‌నెస్ ఎక్కువగా ఉండటం వల్ల వారి రిలేషన్‌షిప్‌లో వచ్చిన సమస్యలు, బ్రేకప్ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.