సంక్రాంతికి వస్తున్నాం రేర్ ఫీట్

Sankranthiki Vasthunam to Screen at Indian Panorama Event

ఈ నెల నవంబర్ 20వ తేదీ నుండి గోవాలో ఘనంగా జరగబోయే అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (IFFI) లోని ఇండియన్ పనోరమా విభాగంలో తెలుగు చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రదర్శితం కానుంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 28 వరకు ఈ వేడుకలు పనాజీలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో జరుగుతాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్టరీ వెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం ఈ విభాగంలో ఎంపిక కావడం విశేషం.. తెలుగు సీనియర్ హీరోలందరిలోనూ ఏ సినిమా సాధించని విధంగా, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రూ. 300 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి రీజినల్ మూవీ లో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.ఇక ఇండియన్ పనోరమాకు తమ సినిమా ఎంపిక కావడం పట్ల నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి హర్షం వ్యక్తం చేశారు.

అలాగే, ఈసినిమాతో పాటు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తుడరమ్’ కూడా ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడనుంది.ఈఏడాది వేసవిలో వచ్చిన తుడరుమ్ కేరళ లో 100కోట్లకు పైన రాబట్టి ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.