లక్కీ భాస్కర్ తరువాత మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా కాంత . టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో రానా , సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనుండగా భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. వచ్చే వారం ఈసినిమా విడుదలకానుంది.దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. అందరికీ హాయ్. కాలాన్ని సినిమా మాత్రమే రీ క్రియేట్ చేయగలదు. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ స్టూడియోస్ లేవు. అందరూ విజయ స్టూడియో, వాహిని స్టూడియో, ఏవీఎన్ స్టూడియోలలో జరిగే మాట్లాడుకునే వాళ్ళు, స్టార్స్ గురించి చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది. అప్పుడు స్టూడియోలో జరిగే విషయాలు చాలా తక్కువ మందికి తెలిసేది. అలాంటి ఒక్క బ్యాక్ డ్రాప్ లో సెల్వ కథ చెప్పడం జరిగింది. కథ విన్న వెంటనే కచ్చితంగా ఈ సినిమా చేయాలనిపించింది.
ఇలాంటి పీరియడ్ సినిమాకి దుల్కర్ సల్మాన్ లాంటి రెట్రో కింగ్ పర్ఫెక్ట్. నవంబర్ 14 తర్వాత దుల్కర్ ని మీరు అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు. భీమ్లా నాయక్ లో సముద్రఖని గారి అబ్బాయిగా చేశాను. ఇందులో మా రిలేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దుల్కర్, సముద్రఖని లాంటి అద్భుత నటుల మధ్య నిల్చుంది భాగ్యశ్రీ. నవంబర్ 14న మీ అందరినీ థియేటర్స్ లో కలుస్తున్నాం.థాంక్యూ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























