ఆంధ్ర కింగ్ తాలూకా బీజీఎమ్ వర్క్ స్టార్ట్

BGM Work Begins for Andhra King Taluka

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచాయి.ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో భాగంగా బీజీఎమ్ వర్క్ స్టార్ట్ చేశారు.ఈ సినిమా కోసం సూపర్ బీజీఎమ్ ను కంపోజ్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు వివేక్ – మెర్విన్. తెలుగులో వీరికి ఇదే మొదటి సినిమా. ఇక ఈసినిమా ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ ,హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు పి డైరెక్షన్ లో హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు.అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈనెల 28న ఈసినిమా విడుదలకానుంది.అయితే 27న యూఎస్ లో ప్రీమియర్స్ పడాలి కానీ అంత కన్నా ఒక రోజు ముందే 26నే అక్కడ రిలీజ్ కానుంది. అంటే ఇండియాలో రిలీజ్ అయ్యే రెండు రోజుల ముందే యూఎస్ లో షోస్ పడనున్నాయి.దాంతో మేకర్స్ కూడా విడుదల తేదీని ఓ రోజు ముందు జరుపాలని చూస్తున్నారు.కుదిరితే సినిమాను 27న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.