రీసెంట్ గా మదరాసి తో ప్రేక్షకులను పలకరించిన తమిళ నటుడు శివ కార్తికేయన్ నుండి నెక్స్ వస్తున్న సినిమా పరాశక్తి .ఇది శివ కార్తికేయన్‌కు 25వ సినిమా. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో అథర్వ, శ్రీలీల, రవి మోహన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల కు తమిళ్ లో ఇదే మొదటి సినిమాఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. సింగరాలా సీతాకోక చిలుక అంటూ వచ్చిన ఈ సాంగ్ క్యాచీగా ఉంది. రేవంత్ , ఢీ , సీన్ రోనాల్డ్ ఈ మెలోడి ని పాడగా భాస్కర్ భట్ల రవి కుమార్ రచించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా తనకు ఇది 100 వ సినిమా.
పరాశక్తి 1990 బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, పొంగల్ కి దళపతి విజయ్ నటించిన జన నాయగన్ కూడా విడుదల కానుండడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది.అలాగే తెలుగులో కూడా సంక్రాంతికి పెద్ది సినిమాలు వస్తుండడంతో పరాశక్తి కి భారీ పోటీ తప్పదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























