దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో రానా ,సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనుండగా భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది.దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడండి.ఎందుకంటే ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది మాకు చాలా స్పెషల్ సినిమా.
నా బెస్ట్ ఫ్రెండ్ రానా తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.నేను వాళ్ళింట్లో అబ్బాయిలానే ఉంటాను. మేమిద్దరం కలసి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. సెల్వ అద్భుతమైన కథతో వచ్చాడు. సముద్రఖని గారితో కలిసి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇందులో ఆయన మెమొరబుల్ పెర్ఫార్మన్స్ చూస్తారు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ గారు చాలా డిఫరెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇందులో అద్భుతమైన మ్యూజిక్ వుంది. ఇది మంచి డ్రామా, థ్రిల్లర్. డెఫినెట్ గా థియేటర్స్ లో చూడండి. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























