మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాణ భాగస్వామ్యంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాంత’ సెన్సార్‌తో సహా ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.ఈసినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేయగా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.2 గంటల 43 నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్‌ను నవంబర్ 6 విడుదలచేయనున్నారు.ఈ సినిమా 1950ల నాటి సినిమా నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడింది.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. మరి ఈసినిమాతో దుల్కర్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి మరియు దుల్కర్ సల్మాన్ తమ బ్యానర్ల ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాను నవంబర్ 14, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























