తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ఇడ్లీ కొట్టు) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమా అక్టోబర్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఈ చిత్రం ఊహించని విధంగా అత్యధిక ఆదరణ పొంది ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఓజీ వంటి పెద్ద సినిమాల కంటే కూడా ఇడ్లీ కడై తక్కువ రోజుల్లోనే ఎక్కువ వ్యూస్‌ను సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం వారం రోజుల్లోనే ఈసినిమా 5.1 మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో ధనుష్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. తన తండ్రి నడిపే ఇడ్లీ దుకాణాన్ని, దాని మూలాలను కాపాడుకోవడానికి తిరిగి వచ్చిన మురుగన్ (ధనుష్) అనే యువకుడి కథ చుట్టూ ఈ ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. ఈ సినిమా ఈనెల 1న థియేటర్లోకి వచ్చి 75 కోట్ల వసూళ్లతో యావరేజ్ గా నిలిచింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ప్రకాష్ రాజ్ ,అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటించారు.
ఇక ధనుష్ లైనప్ లో చాలా సినిమాలే వున్నాయి. ప్రస్తుతం ఈ హీరో తన 54వ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు. విగ్నేష్ రాజా ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుంది.ఈసినిమా తరువాత ధనుష్ నెక్స్ట్ తన 55 వ సినిమాను అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో చేయనున్నాడు.దీంతో పాటు ధనుష్ నెక్స్ట్ ఇళయరాజా ,ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్స్ చేయాల్సి వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























