లక్కీ భాస్కర్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ కాంత తో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నాడు.దుల్కర్ తో కలిసి రానా ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఈనెల 14న కాంత మలయాళం తోపాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈనెల 6న ట్రైలర్ రానుంది.అందులో భాగంగా అనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేశారు.తొలి మెరుపు పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్ ఇంట్రస్టింగ్ గా ఉండి ట్రైలర్ పై అంచనాలు పెంచేసింది.గ్లింప్స్ లో దుల్కర్ ,భాగ్య శ్రీ రెట్రో లుక్ ఆకట్టుకున్నాయి.చివర్లో రానా ను కూడా చూపెట్టారు.ఇందులో తను క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.
ఇదిలావుంటే దుల్కర్ ప్రస్తుతం మరో మూడు సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.అందులో భాగంగా తెలుగులో ఈ హీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.ఇందులో ఆకాశంలో ఒక తార ఒకటి. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుంది.రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు.ఈసినిమాతో పాటు దుల్కర్ లవ్ స్టోరీ నేపథ్యంలో రవి నెలకుడిటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.ఇవే కాకుండా దుల్కర్ మలయాళంలో ఐయామ్ గేమ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























