ప్రేమంటే తో మీ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తిరస్తు – హీరోయిన్ ఆనంది

Premante Will Give You Full Entertainment Says Heroine Anandhi

ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన సినిమా ప్రేమంటే . రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో కనిపించనుంది. నవనీత్ శ్రీరామ్ ఈసినిమాతో డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మిస్తుండగా రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈసినిమా నవంబర్ 21 థియేటర్లలోకి రానుంది.ఇక నిన్న టీజర్ విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈ టీజర్ కోసం లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. టీజర్ చూస్తే మీకు ఎలాంటి వైబ్ వచ్చిందో సినిమాలో అదే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రాప్తిరస్తు .నవంబర్ 21న అందరూ థియేటర్స్ లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. మంచి రొమాంటిక్ కామెడీతో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రియదర్శి గారికి సుమా గారికి మా డైరెక్టర్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇందులో దర్శి గారు చాలా కొత్తగా కనిపిస్తారు. తప్పకుండా అందరూ థియేటర్స్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.

డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నాలుగేళ్ల హార్డ్ వర్క్ ఉంది. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. దర్శి గారు ఆనంద్ గారు సుమ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళందరి పెర్ఫార్మన్స్ మీ అందరిని ఆకట్టుకుంటుంది. థ్రిల్ కావాలనే అమ్మాయి, లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకునే అబ్బాయి కలిస్తే ఎంత ఫన్ ఉంటుందో ఈ సినిమాల్లో చూస్తారు. సుమ గారు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. మీరు థియేటర్స్ లో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. నవంబర్ 21న థియేటర్స్ లో కలుద్దాం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఫ్యామిలీతో కలిసి రండి చాలా ఎంజాయ్ చేస్తారని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.