ప్రేమంటే లో నాది పవర్ ఫుల్ క్యారెక్టర్ అనుకున్నా – సుమ కనకాల

I Thought My Role in Premante Was a Powerful One Says Suma Kanakala

కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి నెక్స్ట్ రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నాడు. ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో కనిపించనుంది. నవనీత్ శ్రీరామ్ ఈసినిమాతో డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈసినిమా నవంబర్ 21 థియేటర్లలోకి రానుంది.నిన్న టీజర్ విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈ టీజర్ కోసం లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఇందులో సుమ కనకాల మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కోసం నన్ను తీసుకున్నారు. కానీ సీన్ చేసిన తర్వాత అది పవర్ లెస్ కానిస్టేబుల్ అని అర్థమైంది( నవ్వుతూ) విశ్వనాథ్ గారు చాలా అద్భుతంగా ఇందులో విజువల్స్ ని చూపించారు. జాన్వి గారిని చూస్తే చాలా కూల్ గా అనిపిస్తుంది. ఆనంది చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. దర్శి చాలా నేచురల్ యాక్టర్. చాలా అద్భుతంగా నటించారు. ఇందులో ఆనంది దర్శి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. నవనీత్ మంచి స్క్రిప్ట్ తో వచ్చారు. ఇందులో లియాన్ జేమ్స్ గారి మ్యూజిక్ సింప్లి సూపర్.ఇందులో నాకు ఒక పాట ఉంది. దానికి ఒక హుక్ స్టెప్ ఉంది, నవంబర్ 21న తప్పకుండా అందరూ సినిమా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నానని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.