మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి.ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ , వర్కింగ్ స్టిల్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈరోజు, మేకర్స్ రెండు డిఫరెంట్ పోస్టర్ల ద్వారా అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జాన్వీ కపూర్ అద్భుతంగా కనిపించింది. రస్టిక్ ప్రింటెడ్ చీర, సంప్రదాయ నగలు, సన్‌గ్లాసెస్‌తో స్టైలిష్‌గా మైక్ ముందు ధైర్యంగా నిలబడి ఉన్న ఆమె లుక్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పోస్టర్ పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.రెండో పోస్టర్‌లో బ్లూ చీరలో జీప్‌పై నిలబడి, ధైర్యంగా అభివాదం చేస్తూ కనిపిస్తుంది. ఇది ఆమె పాత్రలోని సోషల్ ఇంపాక్ట్ , ఆత్మవిశ్వాసాన్ని చక్కగా ప్రజెంట్ చేసింది. ఈ పోస్టర్లలో జాన్వీ పూర్తిగా మాసీ లుక్‌తో ఆకట్టుకుంటోంది.
శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తుండగా అకాడమీ అవార్డు విన్నర్ ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.ఈసినిమా మార్చి 27, 2026న గ్రాండ్ పాన్-ఇండియా విడుదల కానుంది.ఇక త్వరలోనే ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ కూడా రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























