చార్మింగ్ స్టార్ శర్వానంద్ నెక్స్ట్ బైకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో వస్తున్న ఈసినిమాలో శర్వా మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గెలవడం గొప్ప కాదు .. చివరదాకా పోరాడడం గొప్ప లాంటి డైలాగ్స్ బాగున్నాయి.క్వాలిటీ విజువల్స్ , బీజీఎమ్, శర్వా లుక్ ఈ గ్లింప్స్ లో హైలైట్ అయ్యాయి.ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. గ్లింప్స్ చివర్లో ఆయన కూడా కనిపించారు.కానీ పూర్తి లుక్ ను రివీల్ చేయలేదు.
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈ చిత్రం పూర్తయ్యే దశకు చేరుకుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. డిసెంబర్ 6న బైకర్ థియేటర్లలోకి రానున్నాడు. అయితే ఈసినిమా కు ఒక్క రోజు ముందు అఖండ 2 విడుదలకానుంది. దాంతో బాక్సాఫీస్ వద్ద బైకర్ కు గట్టి పోటీ ఎదురుకానుంది.
1990, 2000 బ్యాక్ డ్రాప్ లో సాగే బైకర్ రేసింగ్ యాక్షన్ తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జె. యువరాజ్, మ్యూజిక్ జిబ్రాన్, అనిల్ కుమార్ పి ఎడిటర్. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























