మాస్ జాతర ప్రీమియర్స్ కలెక్షన్స్

Mass Jathara Premieres Register Strong Box Office Collections

మాస్ మహా రాజా రవితేజ నటించిన 75 వ సినిమా మాస్ జాతర ఈరోజు విడుదలకాగా నిన్న సాయంత్రం నుండే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ పడ్డాయి.కేవలం ప్రీమియర్స్ తోనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఈసినిమా కు డీసెంట్ టాక్ వస్తుండడం తో మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డుల తో రన్ అవుతుంది.బుక్ మై షోలో ఇప్పటివరకు లక్షకుపైగా టికెట్లు తెగాయి.మొదటి రోజు ఈసినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు.మాస్ జాతర కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు.

ఇక రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్ లో నటిస్తున్నాడు. 70 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఈనెలలో షూట్ కంప్లీట్ చేసి సినిమాను సంక్రాంతి బరిలో నిలుపనున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.