ఛాంపియన్ టీజర్ రిలీజ్

Champion Official Teaser Out Now

ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ నెక్స్ట్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన రోషన్, అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్వాతంత్య్రం రావడానికి ముందు హైదరాబాద్లో నివసించే ఫుట్‌బాలర్ అయిన మైఖేల్ సీ. విలియమ్స్ మైదానంలో ప్రత్యర్థులను సవాలు చేస్తూ తన ప్రతిభను ప్రదర్శించడంతో ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది.అయితే అతని ముందు చాలా సవాళ్లు  ఉంటాయి. మరి వాటిని ఎలా అధిగమించి ఛాంపియన్ అయ్యాడు అనే కథాశం తో వస్తుంది ఈసినిమా . 

ఫుట్‌బాలర్‌గా రోషన్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించాడు. హైదరాబాదీ యాసలో హిందీ మిక్స్ చేసిన అతని డైలాగ్ డెలివరీ చాలా న్యాచురల్‌గా, క్యారెక్టర్‌కి తగినట్టుగా ఉంది. అనస్వర రాజన్ అందంగా కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ మనసుకు హత్తుకునేలా ఉంది.దర్శకుడు ప్రదీప్ అద్వైతం స్పోర్ట్స్, డ్రామా, యాక్షన్, రొమాన్స్, వార్ అన్నీ ఎలిమెంట్స్ లో అద్భుతమైన నరేషన్‌తో ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.

ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ ఆర్. మధీ వండర్ ఫుల్ విజువల్ క్యాప్చర్ చేశారు. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కట్టింగ్‌ ఎడ్జ్ ఎడిటింగ్‌తో పేస్‌ను మెయింటైన్ చేశారు.

హిస్టరీ, స్పోర్ట్స్ డ్రామా, లవ్ స్టొరీ ఇలా ప్యాక్డ్ కంటెంట్ తో టీజర్ ను కట్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు మేకర్స్. ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్‌కు విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.