ఓటీటీలోకి వచ్చేసిన కాంతార చాప్టర్ 1

Kantara Chapter 1 streaming now on prime video

ఈనెల 2న దసరా రోజు భారీ అంచనాల మధ్య విడుదలై నిన్నటి వరకు 800కోట్లకు పైగా వసూళ్ళతో ఈఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార: చాప్టర్ 1.ఇంకా థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబడుతున్న ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను అమెజాన్ ప్రైమ్, దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.నవంబర్ లో హిందీలో కూడా స్ట్రీమింగ్ లోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కన్నడ లో 240కోట్ల వసూళ్ల గ్రాస్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అంతేకాదు కన్నడ లో 200కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమా కూడా ఇదే. హిందీలో 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సూపర్ హిట్ అనిపించుకోగా తెలుగులో 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది.తమిళంలో 55కోట్ల వసూళ్లతో బాహుబలి 2 ,కెజియఫ్ 2 తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించగా మలయాళం లో 50 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇలా విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అయితే ఓవర్సీస్ లో మాత్రం అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.

బ్లాక్ బస్టర్ కాంతారకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా గుల్షాన్ దేవయ్య విలన్ పాత్రలో కనిపించాడు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.