పెద్ది శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్

Peddhi Wraps Up Sri Lanka Schedule

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది.రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నిన్నటి తో శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.దాదాపు 5 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్ పై సాంగ్ ను చిత్రీకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా శ్రీలంక లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు.ఈషెడ్యూల్ కంప్లీట్ కావడంతో రామ్ చరణ్ కొద్దీ సేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నాడు.ఇక ఇప్పటివరకు ఈసినిమా 70 శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.డిసెంబర్ లోపు సినిమాను కంప్లీట్ చేసి అనుకున్న తేదీకి రిలీజ్ చేయనున్నారు.

ఇక త్వరలోనే ఈసినిమాను ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. పెద్దిలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు.అయితే ముందు రోజు శ్రీరామ నవమి కావడంతో 26నే రిలీజ్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.