స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ , సాంగ్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు మూడో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.లాయి లే అంటూ సాగె ఈ పాట మెలోడియస్ గా ఉంది. కపిల్ కపిలాన్ వోకల్స్ , హేషమ్ అబ్దుల్ వాహబ్ ట్యూన్స్ సాంగ్ ని రీపీట్ మోడ్ లో వినేలా చేశాయి.రాకేందు మౌళి ఈ పాటను రచించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రొమాంటిక్ డ్రామాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న సరసన దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించనుంది.
ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























