మాస్ మహా రాజా రవితేజ నటించిన 75 వ సినిమా మాస్ జాతర.సూపర్ హిట్ మూవీ సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతరతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం టీజర్ ప్రామిసింగ్ గా అనిపించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈరోజు ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ అదిరిపోయింది.ట్రైలర్ లో వింటేజ్ రవితేజ షాట్స్ హైలైట్ అయ్యాయి.యాక్షన్ & ఫన్ ప్యాక్డ్ గా కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా శ్రీలీల హీరోయిన్ నటించింది.మాస్ జాతర కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సివుంది. ముందుగా ఈనెల 31న రిలీజ్ చేయాలనుకున్నారు అయితే ఆ డేట్ కి బాహుబలి ది ఎపిక్ కూడా రిలీజ్ అవుతుండడం తో అదే రోజు సాయంత్రం నుండి ప్రీమియర్స్ వేసి నవంబర్ 1న రిలీజ్ చేయనున్నారు.
ఇక చాలా రోజులనుండి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ మాస్ జాతర తో హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నాడు. మరి ఈసినిమా రవితేజ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























