ఉస్తాద్ రామ్ పోతినేని – మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఇప్పటివరకు ఈసినిమానుండి రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.అలాగే రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయ్యి ఆ హైప్ ను డబుల్ చేసింది. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.కుదిరితే ఈనెల 31న విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా లవ్ సాంగ్ గా రానున్న ఈ పాట కూడా చార్ట్ బస్టర్ కావడం పక్కా అని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు. అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నాడు.తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది.
ఇక ఈసినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు రామ్.వరుస పరాజయాల నేపథ్యం లో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు రామ్ .అందుకు తగ్గట్లే సినిమా కూడా బాగా వస్తుందట. సినిమా విజయం పై అయితే రామ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఇక ఈసినిమా తరువాత రామ్ నెక్స్ట్ సినిమాను ఇంకా ఓకే చేయలేదు. ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ తరువాతే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























