యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ దీపావళి బ్లాస్ట్ డ్యూడ్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మమితా బైజు హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.ఈ సందర్భంగా మేకర్స్ డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 cr జర్నీ ఈవెంట్ ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 cr జర్నీ ఈవెంట్ లో హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ… డ్యూడ్ సినిమా 100 కోట్లు కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలపడానికి ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. ఆడియన్స్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. లవ్ టు డే. డ్రాగన్ చిత్రాలకు ఎంత ఆదరణ ఇచ్చారో ఈ చిత్రానికి కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు. మీ సపోర్ట్ కి ఎప్పుడూ కృతజ్ఞతలు ఉంటాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు అని అన్నారు.
ఇక డ్యూడ్ తో ప్రదీప్ హ్యాట్రిక్ అందుకున్నాడు. ఇంతకుముందు లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్ లో జాయిన్ కాగా ఆ తరువాత రిటర్న్ అఫ్ ది డ్రాగన్ తో మరో సారి 100కోట్ల క్లబ్ లో చేరి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు డ్యూడ్ తో అదే ఫలితాన్ని రిపీట్ చేసి చేసిన మూడు సినిమాలతో మూడు సార్లు 100 కోట్ల మైలు రాయిని చేరుకున్న ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























