సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్ .. తన పెళ్లికి ఆహ్వానించిన హీరో

Hero Nara Rohith Invites CM Revanth Reddy for His Wedding

టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం నటి శిరీష లేళ్లతో అంగరంగ వైభవంగా జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి పెళ్లి వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నేపథ్యంలో వివాహ పనుల్లో బిజీగా ఉన్న రోహిత్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాలుగు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.అందులో భాగంగా అక్టోబర్ 25న హల్దీ, 26న సంప్రదాయబద్ధంగా పెళ్లికొడుకు కార్యక్రమం, 28న మెహందీ వేడుకలు జరగనున్నాయి. అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు శుభ ముహూర్తాన రోహిత్, శిరీష ఒక్కటి కానున్నారు.

వీరిద్దరి పరిచయం ప్రతినిధి–2 సినిమా షూటింగ్ సమయంలో స్నేహంగా మారి, అది ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న నిశ్చితార్థం జరిగింది. అయితే తర్వాత రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో పెళ్లి వాయిదా పడింది.ఇక ఏడాది తరువాత పెళ్లి తేదీ ఖరారు కావడంతో నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే నారా రోహిత్ మళ్ళీ సినిమాల్లో యాక్టీవ్ అయ్యాడు.చాలా గ్యాప్ తరువాత గత ఏడాది ప్రతినిధి 2 తో ప్రేక్షకులముందుకు రాగా ఈఏడాది భైరవం ,సుందరకాండ తో పలకరించాడు. పెళ్లి హడావిడి ముగిశాక తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.