యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా వున్నాడు.అందులో నారీ నారీ నడుమ మురారి ఒకటి.షూటింగ్ కూడా చివరికి చేరుకుంది.ఇక ఈసినిమాతో శర్వా సంక్రాంతికి రేస్ లోకి వస్తున్నాడు.నిన్న దీపావళి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి సంక్రాంతికి వస్తున్నాం అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.అయితే సంక్రాంతి టైంలో తెలుగు నుండి మరో 4 సినిమాలు కూడా విడుదలకానున్నాయి.ఇందులో అన్ని పెద్ద సినిమాలే.దాంతో నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా పర్ఫెక్ట్ ఫామిలీ ఎంటర్టైనర్ కావడంతో రిస్క్ చేస్తున్నారు మేకర్స్.ఇక ఇంతకుముందు శతమానం భవతి తో రిస్క్ చేసి భారీ విజయాన్ని సాధించాడు శర్వానంద్. మరి నారీ నారీ నడుమ మురారి తో కూడా మరో సారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడో చూడాలి.త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.
ఇక శర్వానంద్ ఈసినిమాతో పాటు బైకర్ , భోగి సినిమాలు కూడా చేస్తున్నాడు. బైకర్ అభిషేక్ కంకర డైరెక్ట్ చేస్తుండగా అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.భోగి విషయానికి వస్తే సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఇందులో శర్వా మాస్ రోల్ లో కనిపించనున్నాడు.అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























