సలార్, కల్కి 2898 ఏడి చిత్రాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టి సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈసినిమానుండి అప్డేట్ రానుంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈనెల 22న ఈ అప్డేట్ రివీల్ చేయనున్నారు. ఈ సందర్భంగా నిన్న ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. మ్యాసీవ్ రైఫిల్స్ ఒక క్లస్టర్‌లో అమర్చబడి, కొన్ని యాంగిల్స్ నిటారుగా, కాల్పులు జరుపుతూ, యుద్ధ వాతావరణాన్ని చూపించాయి. ఒంటరి బెటాలియన్ లాగా నిలబడి ఉన్న ప్రభాస్ సిల్హౌట్ అదిరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అతను పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు”అని పోస్టర్ పై రాసి వుండటం మహాభారతంలోని అర్జునుడిని పొయెటిక్ గా ప్రజెంట్ చేస్తోంది. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్‌తో పాటు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.తనకు ఇదే మొదటి సినిమా.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అనిల్ విలాస్ జాధవ్ చేపట్టగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.అద్భుతమైన విజన్, అత్యుత్తమ టెక్నికల్ టీం, ప్రముఖ నిర్మాణ సంస్థల మద్దతు, ఇంతకుముందు ఎప్పుడూ చూడని అవతార్‌లో నటిస్తున్న స్టార్ హీరో ప్రభాస్, ఇవన్నీ కలగలిపి ఈ సినిమా థియేటర్లలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా నిలవబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























