నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించిన తాజా హిందీ చిత్రం ‘థామా’. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటించాడు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యాడ్ డాక్ సూపర్ నేచురల్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన బ్లాక్ బస్టర్స్ ‘స్త్రీ, ముంజియా’ చిత్రాల తరహాలోనే థామా కూడా రూపొందుతోంది. కొన్నిరోజుల క్రితం ‘వరల్డ్ ఆఫ్ థామా’ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ సినిమా థీమ్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. థామ అన్ని సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.
కాగా మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబరు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























