నవ దళపతి సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధర’ నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా (Ess Kay Gee ఎంటర్‌టైన్‌మెంట్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, డివోషనల్ ఫాంటసీ హారర్ జానర్ ని రిడిఫైన్ చేసేలా వుంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులకు టెర్రిఫిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ హైలైట్స్:
- పురాతన కాలంలో సంపదను దాచడానికి “పిశాచ బంధనం” అనే ఘోర మంత్రాన్ని ఉపయోగించేవారు. ఇది ఆ సంపదను కాపాడేందుకు రాక్షసాత్మల్ని ఆహ్వానించే మంత్రం.
- భూతాలు లేవని నిరూపించాలనుకునే ఒక స్కెప్టిక్ ఘోస్ట్ హంటర్, ఒకరి లోభం కారణంగా ఈ బంధనాన్ని భంగం చేస్తాడు. దీంతో “ధన పిశాచ” అనే శాపగ్రస్త దయ్యం మేల్కొంటుంది.
- ఒక చిన్నారి బలి జరగబోతోందన్న భయంకర కలతో, ఆ హంటర్ ఒక దుష్ట శక్తీని అడ్డుకోవడానికి బయలుదేరుతాడు. ఈ అల్లకల్లోలానికి అర్థం కాని దశలో ప్రారంభమవుతుంది శివుడు, సృష్టి.. వినాశనానికి ప్రతిరూపమైన ఆ దివ్య శక్తి.
- ట్రైలర్‌లో భూతపిశాచాలు, శాపగ్రస్త ఆలయాలు, ఆధ్యాత్మిక యుద్ధాలు కళ్ళు తిప్పుకోలేని విధంగా చూపించారు.
- ముఖ్యంగా సుధీర్ బాబు నేలపై వున్న రక్తం త్రాగుతూ తపస్సులోకి వెళ్ళే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పించింది. పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా వుంది.
- సోనాక్షి సిన్హా ధన పిశాచిగా అదరగొట్టింది. అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోద్కర్ పాత్రలు ఆసక్తి రేకెత్తిస్తున్నారు.
- వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ ఎలిమెంట్స్ తో పాటు భారతీయ పురాణ వైభవాన్ని అద్భుతంగా చూపిస్తున్నాయి.
- సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా వుంది. రాజీవ్ రాజ్ సంగీతం ప్రతి రీచువల్ సీన్‌లోనూ టెన్షన్, థ్రిల్‌ని పెంచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Tollywood Directors About DUDE | Hanu Raghavapudi | Buchi Babu | Pradeep Ranganathan | Mamitha Baiju
19:04

Pradeep Ranganathan Hilarious Funny Reactions | Dude Swag Event | Mamitha Baiju | Keerthiswaran
04:55

నువ్వు నా కొడుకు లెక్కే..పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి ❤️ | Heartfelt Words About Sai Dharam Tej
02:19

Sai Dharam Tej Emotional Speech | SYG Glimpse Launch | Aishwarya Lekshmi | Sai Durgha Tej | TFN
09:46
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























