నేషన్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న మీసాల పిల్ల

Meesaala Pilla Song Trending All Over India

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమా నుండి మొదటి సాంగ్ మీసాల పిల్ల రిలీజ్ చేయగా మామలు రీచ్ రావడం లేదు.రీజినల్ లాంగ్వాజ్ లో వచ్చిన ఈసాంగ్ నేషన్ వైడ్ గా యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇప్పటివరకు 17 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సాంగ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ ఒక్క సాంగ్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ తెచ్చుకుంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేసింది.ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా క్యాథరిన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది.మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఇందులో క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇక ఈసినిమాను పూర్తి చేసి చిరు , బాబీ డైరెక్షన్ లో సినిమాను మొదలు పెట్టనున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుండగా తమన్ సంగీతం అందించనున్నాడు. నవంబర్ లో సినిమా లాంఛ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.