‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ‘డ్యూడ్’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ విలేకరుల సమావేశంలో డ్యూడ్ సినిమా విశేషాలు పంచుకున్నారు.
మొన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ 10 ఏళ్లలో ఇలాంటి సినిమా చేయాలనేది మా డ్రీమ్ అన్నారు. ఈ సినిమాలో ఉన్న అంత స్పెషల్ ఏమిటి?
- ఇలాంటి సినిమా రాలేదు అనే ఉద్దేశంతో చెప్పడం కాదు.
- అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయంలో ప్రాసెస్ అంతా చాలా హ్యాపీగా జరిగిన సినిమా ఇది.
- అదే సమయంలో ప్రాఫిటబుల్ వెంచర్. సినిమా బడ్జెట్‌లో జరిగింది.
- ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏ కంటెంట్ చూసినా అద్భుతంగా ఉండేది.
- తెలుగులో కూడా మేము అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్‌తో తీసిన సినిమాలు ఉన్నాయి.
- ‘మత్తు వదలరా, చిత్రలహరి, గ్యాంగ్ లీడర్’ సినిమాలు అనుకున్న సమయంలోనే అయ్యాయి.
ఈ సినిమా ఎలా ఉండిపోతుంది?
- ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. చాలా కొత్త కథలాగా అనిపిస్తుంది. చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి.
- అలాగే ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. మనం సెకండ్ హాఫ్ గెస్ చేస్తుంటాం.
- కానీ ఈ సినిమా గెస్సింగ్‌కి భిన్నంగా వుంటుంది. మంచి క్వాలిటీ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది .
- డైరెక్టర్ గారు చెప్పిన కథకంటే 20% ఎన్‌హాన్స్ చేసి తీశారు. సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి.
- ఈ సినిమా అందరికీ కరెక్ట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది.
లాస్ట్ 20 మినిట్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని వినిపిస్తుంది. అది తమిళనాడుకి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు?
- కథకి ఎంత కావాలో అంతే మోతాదులో ఇందులో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి.
- సినిమా అందరికీ నచ్చుతుంది అందరూ ఇష్టపడతారు. డ్యూడ్ ఈ కథకు యాప్ట్ టైటిల్.
- తమిళ్‌తో సమానంగా తెలుగులో ఈ సినిమా ఆడుతుందని నమ్మకం ఉంది. ఇది మన ఎమోషన్స్‌కి తగ్గట్టుగా ఉండే సినిమా.
తెలుగు, తమిళ్ బిజినెస్ ని కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది?
- థియేట్రికల్‌గా తమిళ్‌లో ఎక్కువ ఉంది. ప్రదీప్ గత చిత్రం తమిళనాడులో దాదాపుగా 31 కోట్లు చేసింది షేర్ చేసింది.
- ఇప్పుడు దివాళీ సీజన్ కూడా యాడ్ అయ్యింది. అంతే రేంజ్ టాక్ వస్తే అంతకంటే మంచి షేర్ కలక్ట్ చేస్తుంది.
- తమిళ్‌లో ‘ఏజీఎస్’ ద్వారా మేము సొంతగా రిలీజ్ చేస్తున్నాము.
మీరు హిందీలో ‘జాట్’ సినిమా తీశారు.. అది తెలుగులో ఎందుకు ప్రమోట్ చేయలేదు?
- తెలుగు ప్రమోషన్స్‌కి సమయం కుదరలేదు. హిందీలో సినిమాను చాలా అద్భుతంగా ప్రమోట్ చేశారు.
- మా డైరెక్టర్ గారు, హీరో చాలా కష్టపడే చేశారు. తెలుగులో చేయడానికి సమయం దొరకలేదు.
- అది మాకు మంచి వెంచర్. పార్ట్ 2 కూడా వుంటుంది.
తమిళ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా.. కథల ఎంపిక ఎలా చేస్తున్నారు?
- డీవోపీ నికేత్ గారు ఈ కథ మా దగ్గరికి తీసుకు వచ్చారు. మాకు కూడా చాలా నచ్చింది.
- తమిళనాడులో మాకు మంచి ఆఫీసు ఉంది.
- ఇప్పుడు ఒక కథ విన్నాము. అందరూ కొత్తవాళ్లతో ఆ సినిమా చేస్తున్నాం.
మీరు చాలా సినిమాలు తీస్తున్నారు కథ ఎవరు పరిశీలిస్తారు?
- ఒక్క ముగ్గురు నలుగురు టీ ఉంది. వాళ్ళు విని అంత బాగుంది అనుకున్నాక మా దగ్గరికి తీసుకొస్తారు.
- మేము విని డిస్కస్ చేసుకుని ఓకే అంటే ప్రొసీడ్ అవుతాం.
డ్యూడ్ ఫుల్‌గా యూత్ సినిమానా?
- ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. డెఫినెట్‌గా చాలా కొత్తగా ఉంటుంది.
- చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది ‘సఖి’ లాంటి ఫ్యామిలీ మూవీ. చాలా యూత్ ఫుల్ మూమెంట్స్ ఉంటాయి
మీరు చేసే సినిమాలన్నీ సుకుమార్ గారు చూస్తుంటారు కదా ఈ సినిమా చూశారా?
- ఆయన ప్రజెంట్ ఊర్లో లేరండి. ఆయన బెస్ట్ విషెస్ మాకు ఎప్పుడూ ఉంటాయి. హీరో ప్రదీప్ గారికి చాలా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారని విన్నాము?
- సినిమా స్టార్టింగ్ ముందు ఏ రెమ్యూనరేషన్ అయితే అనుకున్నామో అదే ఇచ్చాము.
- ప్రదీప్ గారు రెమ్యూనరేషన్ గురించి ఆలోచించే మనిషి కాదు. ఆయన డైరెక్టర్ బైక్‌లో షూటింగ్‌కి వస్తున్నారని కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.
- ఒక మంచి కథని తీసుకొచ్చారని, అనుకున్నది అద్భుతంగా తీస్తున్నారు అనే సంతోషంతో బహుమతి ఇచ్చారు.
ప్రభాస్, ఎన్టీఆర్ గారి సినిమాలు ఎప్పుడు రావచ్చు?
- ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారి సినిమాలు రెండు కూడా 2026లో వస్తాయి
ప్రదీప్ గారి రెండు సినిమాలు ‘లవ్ టుడే డ్రాగన్’ తెలుగులో మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాయి.. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
- అంతకుముందు అతని హిట్ సినిమాలు దాదాపు 12 కోట్లు చేశాయి.
- ఇప్పుడు రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 15 కోట్లు చేస్తే డీసెంట్ నెంబర్ చేసినట్టు.
- డ్యూడ్ డెఫినెట్‌గా చేస్తుందని నమ్ముతున్నాము.
ప్రేక్షకుల అంచనాలను అందుకునే సినిమాలు తీయడం చాలెంజింగ్‌గా అనిపిస్తోందా?
- హైప్ వున్న సినిమాకి వస్తున్నారు. ఇంకొన్ని సినిమాలకి టాక్ బాగుంటే వస్తున్నారు. లేదంటే సినిమా చచ్చిపోతుంది.
- కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. 50% మినిమం గ్యారంటీ ఉండేది.
రేమ్యునిరేషన్ ఎక్కువైపోయి ప్రొడక్షన్ కి డబ్బులు సరిపోవట్లేదు అనే అభిప్రాయాన్ని మీరు ఎలా చూస్తారు?
- మిగతా లాంగ్వేజ్‌తో పోల్చుకుంటే మనం ఆ విషయంలో చాలా బెటర్‌గా ఉన్నామని భావించాలి.
- ప్రొడక్షన్ మీద మనం చాలా మంచి అమౌంట్ ఖర్చు చేస్తున్నాం. ఎవరికైనా సరే డిమాండ్‌ను బట్టి పే చేస్తాము.
డ్యూడ్ కి ఎలాంటి అంచనాలతో రావాలి?
- ప్రదీప్ రంగనాథన్ గారి సినిమాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. యూత్ ఫుల్ గా ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది.
- ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా అన్ని ఎమోషన్స్ మీకు కనిపిస్తాయి. ఫ్యామిలీస్ యూత్ అందరికీ నచ్చే సినిమా ఇది.
సాయి అభ్యంకర్ మ్యూజిక్ గురించి?
- తను చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు.
- బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
- తనతో ఫ్యూచర్ లో కూడా వర్క్ చేయాలని ఉంది.
‘పెద్ది’ ఎప్పుడు వస్తుంది?
- పెద్ది 2026 మార్చ్ 27 కన్ఫామ్.
దీపావళికి ఫస్ట్ లిరికల్ వీడియో వస్తుందని విన్నాం?
- దానికి కొంచెం టైం పట్టేలా ఉంది, లిరికల్ వీడియో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో చేయాలి.
- సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది.
సుకుమార్ గారి సినిమా ఎప్పుడు ఉంటుంది?
- పెద్ది అవ్వగానే స్టార్ట్ అవుతుంది.
ఆంధ్ర కింగ్ ఎలా ఉండబోతుంది?
- సినిమా చాలా బాగా వచ్చిందండి. రామ్ గారికి చాలా డిఫరెంట్ మూవీ. డెఫినెట్ గా చాలా బాగుంటుంది.
దీపావళికి నాలుగు సినిమాలు ఉన్నాయి కదా.. ఈ కాంపిటీషన్ ఎలా చూస్తారు?
- లాస్ట్ టైం కూడా మూడు సినిమాలు వచ్చాయి. అమరన్, లక్కీ భాస్కర్, క.. మూడు సినిమాలు కూడా బాగా ఆడాయి.
- మేము ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ లో ఉన్నాం. అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటాము.
- మేము అందరి హీరోలతోనూ పని చేస్తున్నాము. అందరి సినిమాలు కూడా అద్భుతంగా ఆడి థియేటర్స్ కళకళలాడాలని మనస్పూర్తిగా కోరుకుంటాం.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























