గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా మరో 50 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం కౌంట్‌డౌన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా, “50 డేస్ టు గో” అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పోస్టర్‌లో “ది మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్” అనే ట్యాగ్‌లైన్, సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. బాలయ్య చేతిలో త్రిశూలం, ముఖంపై తాండవం తాలూకు ఛాయలు— అన్నీ కలిపి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాక్షన్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి. శివతాండవం వాతావరణంలో అఖండ లుక్ అద్భుతంగా ఉండగా, బాలయ్య సరికొత్త విరాటరూపంతో ఆకట్టుకున్నారు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం, బాలయ్య కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. కాగా, ఈ చిత్రాన్ని రామ్ ఆచంట – గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మొదటి భాగం ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘అఖండ 2’తో ఆ కాంబినేషన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద రాబోతోంది. కాగా, అఖండ 2: తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























