మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ క్రేజీ పాన్-ఇండియా చిత్రం SYG (సంబరాల ఏటి గట్టు) తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ స్టొరీతూ విజువల్ ట్రీట్ కానుంది. సాయి దుర్గ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అసుర ఆగమన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది గూస్‌బంప్స్‌ను తెప్పించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సంబరాల ఏటిగట్టు (SYG)” వరల్డ్ ని ప్రజెంట్ చేసిన తీరు అద్భుతంగా వుంది. అంబిషన్‌తో కూడిన మిథికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది. సాయి దుర్గ తేజ్‌ను ఒ పవర్ ఫుల్ యోధుడి పరిచయం చేస్తూ గ్లింప్స్ ప్రారంభమవుతుంది.
సాయి దుర్గ తేజ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఎమోషన్స్ అదిరిపోయాయి. కళ్లలో మండే ఆవేశం, బలమైన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లలోని ఫైర్ అన్నీ కలిపి ఆయన పాత్రను లార్జర్ దెన్ లైఫ్ ప్రజెంట్ చేశాయి. ఇది ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన గ్రాండియర్‌ను ఇచ్చాయి. సినిమాటోగ్రాఫర్ వెట్రివెల్ పళనిసామీ కెమెరా వర్క్ అదిరిపోయింది. యాక్షన్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో వుంది. కాంతార ఫేమ్ బి.అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ఎలివేట్ చేసింది ఎడిటర్ నవీన్ విజయకృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ టెక్నికల్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.
“అసుర ఆగమనం” గ్లింప్స్ తెలుగు సినిమాకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసేలా ఉంది. సాయి దుర్గా తేజ్, రోహిత్ కె.పి. ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు మిథికల్ యాక్షన్ సినిమాల స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
అసుర ఆగమన గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మామయ్యలు చిరంజీవి గారు కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు బర్త్డే విషెస్ అందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది.సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అద్భుతమైన క్వాలిటీతో ఇవ్వాలని చాలా హార్డ్ వర్క్ చేసి చేస్తున్నాము. మా నిర్మాతలు నిరంజన్ గారు చైతన్య గారు చాలా సపోర్ట్ చేశారు. ఖర్చుకి వెనకాడకుండా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఆయేషా గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ కి దాదాపుగా 50 కాస్ట్యూమ్స్ చేశారు. గాంధీ గారు అద్భుతంగా ప్రొడక్షన్ డిజైన్ చేశారు. నా విరూపాక్ష సినిమాకు మ్యూజిక్ చేసిన అజినీస్ ఈ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ రోహిత్ చాలా మంచి కథ రాసుకున్నారు. తను హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. తన విజన్ మీ అందరికీ నచ్చుతుంది. సినిమా అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. దేవకట్టా, వశిష్ట, వివేక్, ఆనంద్ గారికి థాంక్ యూ. ఇది వండర్ఫుల్ ఫిలిం. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























