పెద్ది పూణే షెడ్యూల్ కంప్లీట్

peddi team wraps up pune schedule

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ -ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈసినిమా సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక నిన్నటి తో పూణే షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇందులో రామ్ చరణ్ , హీరోయిన్ జాన్వీ కపూర్ పై మెలోడీ సాంగ్ ను చిత్రకరించారు. త్వరలోనే ఈసాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటివరకు ఈసినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.నవంబర్ లోపు షూటింగ్ అంతా పూర్తి చేయనున్నారు.ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తుండగా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.మార్చి 27న పెద్ది థియేటర్లోకి రానుంది.

అయితే ఈసినిమాకు ఒక్క రోజు ముందు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ రిలీజ్ కానుంది.శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా వున్నాయి. ఒకవేళ ఈ రెండు సినిమాలు చెప్పిన తేదీకే వస్తే బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.