విశాల్ మగుడం నుండి తప్పుకున్న డైరెక్టర్ 

Director Steps Down from Vishal’s Magudam Project

కోలీవుడ్ వర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం తన 35వ సినిమా మగుడం లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.విశాల్ సరసన యంగ్ బ్యూటీ దుషారా విజయ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టార్ హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.అయితే ఈసినిమా  డైరెక్టర్ రవి అరసు దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడని సమాచారం. దాంతో ప్రస్తుతం విశాలే ఈ  సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.విశాల్ తో క్రియేట్ డిఫరెన్సెస్ వల్ల రవి అరుసు ఈసినిమా నుండి తప్పుకున్నట్లు  వార్తలు వస్తున్నాయి. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకుముందు విశాల్  తుప్పరివాలన్ 2 సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అయితే ఆ తరువాత విశాల్ సినిమాను కంప్లీట్ చేద్దామనుకున్నాడు కానీ  అది మధ్యలోనే ఆగిపోయింది.మరి ఇప్పుడు  మగుడం అయినా కంప్లీట్  అవుతుందో చూడాలి.సినిమా షూటింగ్ కూడా సగానికిపైగా పూర్తయింది.

మగుడం అంటే తెలుగులో కిరీటం అని అర్థం. ఇటీవల విడుదల చేసిన ఈసినిమా  టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశాల్ మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించారు.ఓ లుక్‌లో వైరెటీ హెయిర్ కటింగ్‌తో, మరో లుక్‌లో సూట్, బూట్‌తో ముసలివాడిలా, ఇంకో లుక్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలా డీసెంట్ లుక్‌తో ఆకట్టుకున్నారు. సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.