రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా పరిధి దాటి పాన్ వరల్డ్ రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎన్నో చిత్రాలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం ‘ఈశ్వర్’ అనే సినిమాతో అన్న సంగతి తెలిసిందే. త్వరలో, అంటే ఈ నెలలో (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు పెద్ద పండగకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా, ప్రభాస్ మొదటి చిత్రం ‘ఈశ్వర్’ను అక్టోబర్ 23న ఆయన పుట్టినరోజు కానుకగా, ప్రపంచవ్యాప్తంగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో 4K క్వాలిటీతో మేకర్స్ థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ-రిలీజ్‌ను మరింత ఉత్సాహంగా మారుస్తూ, తాజాగా ‘ఈశ్వర్’ 4K రీ-రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
4K ట్రైలర్లో ప్రభాస్ గ్రేస్
తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ అభిమానులను నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. కొత్త హంగులతో, 4K క్వాలిటీతో మెరుగ్గా కనిపిస్తున్న ఈ ట్రైలర్లో యువ ప్రభాస్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డార్లింగ్ అభిమానుకు పండగే
ప్రభాస్ సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన ‘ఈశ్వర్’ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ రీ-రిలీజ్ కలెక్షన్లలో రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఈ సినిమా రీ-రిలీజ్‌తో మరింత భారీ స్థాయిలో జరగనున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























