ఆగస్టు చివర్లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి చరిత్ర సృష్టించింది మలయాళం సినిమా లోకః చాప్టర్ 1 – చంద్ర. ప్రపంచ వ్యాప్తంగా 300కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం హైయెస్ట్ మలయాళ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మాలీవుడ్ లో ఇదే మొదటి 300కోట్ల సినిమా.కేవలం 2కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా ఊహించని రన్ తో ఏకంగా 300కోట్ల సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.అటు కేరళ లోనూ ఈసినిమా 120 కోట్ల వసూళ్లతో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.సినిమా విడుదలై 50రోజులకు వస్తున్న ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చింది.త్వరలోనే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది. ఈవిషయాన్ని జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.దీపావళి తరువాత ఈనెల 21న అన్ని దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసురానుందని సమాచారం.రీసెంట్ గా విడుదలైన సినిమాల్లో మహావతార్ నరసింహ తరువాత సెన్సేషనల్ లాంగ్ రన్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది లోక.
ఇక తెలుగులో ఈసినిమా కొత్త లోక గా విడుదలై హిట్ అనిపించుకుంది.ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేశాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించింది.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























