టాలీవుడ్ సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నేడు (అక్టోబర్ 15) జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మెగా కుటుంబ సభ్యులు మరియు పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా, మెగా ఫ్యామిలీ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేనమామలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక లేఖలు, ఎమోషనల్ సందేశాల ద్వారా విషెస్ చెప్పడం హైలైట్‌గా నిలిచింది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సాయి దుర్గ తేజ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విషెస్ తెలుపుతున్న ఇతర సినీ ప్రముఖులు
ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, మంచు మనోజ్ వంటి హీరోలు కూడా సాయి దుర్గా తేజ్ కంబ్యాక్ స్టోరీని, ఆయనలోని మంచితనాన్ని, ఎనర్జిటిక్ వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సాయి దుర్గ తేజ్ తన తల్లి పేరును జతచేసి ‘సాయి దుర్గ తేజ్’గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























