మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు”. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొన్నిరోజుల క్రితం విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మరియు రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ మూవీ సెట్స్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసాడు. అతనెవరో కాదు, మన తెలుగు కుర్రాడు, తిలక్ వర్మ. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అజేయంగా 69 పరుగులతో తిలక్ వర్మ భారత జట్టుకి సంచలన విజయాన్ని అందించిన విషయం అభిమానులకు గుర్తుండేవుంటుంది. అయితే, చిరంజీవి అంటే అభిమానం ఉన్న తిలక్ తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సెట్స్‌లో సందడి చేసాడు.
ఈ మేరకు దీనిపై చిత్ర నిర్మాత సాహూ గరపాటి సోషల్ మీడియాలో స్పెషల్ ట్వీట్ చేసి విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అందులో.. “మన శంకర వరప్రసాద్ గారు సెట్‌లో తిలక్ వర్మను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. అతను సాధించిన విజయాలు మొత్తం తెలుగు కమ్యూనిటీకి గర్వకారణం. ఈ యువ ఆటగాడు క్రికెట్ ప్రపంచంలో కొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మన శంకర వరప్రసాద్ గారు ఈ ఏడాది సమ్మర్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేయగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇందులో చిరుని వింటేజ్ లుక్‌లో చూపించబోతుండటం మెగా ఫ్యాన్స్‌కి నిజమైన ఫెస్టివల్ ట్రీట్‌గా మారనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























