సరిగమ చేతికి పరాశక్తి ఆడియో రైట్స్ 

Parasakthi Audio Rights Bagged by Saregama

రీసెంట్ గా మదరాసి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ పరాశక్తి తో రానున్నాడు. తనకు ఇది 25వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీని ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.శ్రీలీల కు కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.1990 లో జరిగే పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతుంది ఈసినిమా.రీసెంట్ గా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ ప్రముఖ మ్యూజిక్ సంస్థ సరిగమ సౌత్ దక్కించుకుంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.జనవరి 14న పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.ఈసినిమాపై భారీ  అంచనాలు వున్నాయి. అయితే పొంగల్ కు దళపతి విజయ్ జన నాయగన్ కూడా విడుదలవుతుండడంతో  బాక్సాఫీస్ వద్ద ఇంట్రస్టింగ్ క్లాష్ జరుగనుంది. 

ఇక పరాశక్తి పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతుండగా అదే టైంకి  టాలీవుడ్ లో సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తుండడంతో  పరాశక్తి కి తెలుగులో కూడా భారీ పోటీ ఎదురుకానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.